Thalliki Vandanam Latest News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద మరో 325 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతలో లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా కొందరికి డబ్బులు అందలేదు. ఈ అర్హులైన లబ్ధిదారులను తిరిగి గుర్తించి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ ఏడాది కొత్తగా పాఠశాలల్లో చేరిన ఒకటో తరగతి విద్యార్థులు మరియు ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల తల్లులకు కూడా పథకం వర్తిస్తుంది.
మొత్తం 5.5 లక్షల మంది 1వ తరగతి విద్యార్థులు, 4.7 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల తల్లులకు డబ్బులు జమ చేయనున్నారు. ప్రస్తుతం అర్హుల తుది జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ వారం నుంచి డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రతి విద్యార్థికి రూ.15,000 కేటాయించగా, రూ.13,000 తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. మిగిలిన రూ.2,000 ను పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం జూన్‌లో రూ.10,091 కోట్లు ఖర్చు చేసింది. అర్హుల జాబితా తనిఖీ చేయడానికి https://gsws-nbm.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ Application Status Check పై క్లిక్ చేసి, ఆధార్ నెంబర్, క్యాప్చా, OTP నమోదు చేసి మీ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.
