ABVP (అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్) జూన్ 26వ తేదీ బుధవారం తెలంగాణాలో రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌ను ప్రకటించింది.
పాఠశాలలు తెరిచి దాదాపు 15 రోజులు కావస్తున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విద్యార్థుల అవసరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని ఏబీవీపీ ఖండించింది.
దీనికి తోడు పలు ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలోని అన్ని పాఠశాలలను స్వచ్ఛందంగా మూసివేయాలని, బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Tags - tomorrow abvp bandh in telangana, bandh in telangana for schools, june 26th holiday for schools, june 26th holiday for schools telagnana, june 26th holiday for schools telangana news telugu, 2024 June 26th Schools Holiday, School Bandh in Telangana On June 26th, June 26th School Strike in Telangana, abvp bandh on 26th june 2024